212 మంది ఆంధ్రులు నేపాల్ లో 12 లొకేషన్ లలో ఉన్నారు. ఖాట్మండ్ లో ఎక్కువ మంది ఉన్నారు. టైం టు టైం మానటిరంగ్ జరుగుతోంది. ఖాట్మాండ్ నుంచి ప్రత్యేక విమానంలో రేపు ఆంధ్రుల ను నేపాల్ నుంచి తీసుకు వస్తాం.. ఆ ఫ్లైట్ శ్రీకాకుళం.. కడప లో ల్యాండ్ అవుతుందన్నారు..
నేపాల్‌లో చిక్కుకున్న తెలుగువారిని సురక్షితంగా రాష్ట్రానికి తీసుకురావడానికి రంగంలోకి దిగారు మంత్రి నారా లోకేష్.. అనంతపురంలో సూపర్ సిక్స్ - సూపర్ హిట్ సభకు కూడా వెళ్లకుండా.. నేపాల్ నుంచి ఏపీవారిని సురక్షితంగా రాష్ట్రానికి రప్పించడానికి అధికారులతో నిరంతరం సమన్వయం చేస్తున్నారు మంత్రి నారా లోకేష్.