అల్లర్లపై డీజీపీకి సిట్ నివేదిక ఇచ్చిన విషయం తెలిసిందే. సిట్ ఏపీ అల్లర్లపై మరో నివేదిక ఇవ్వనుంది. ఇవాళ ఇచ్చిన ప్రాథమిక నివేదికలోనే కీలక సిఫార్సులు, గుర్తించిన అంశాలు పొందుపర్చింది. ప్రస్తుతానికి 2 రోజుల విచారణ ముగిసినప్పటికీ కేసులపై పరివేక్షణ ఇకపై కూడా చేయనునుంది.
ప్రజలు శాంతియుతంగా ఉండాలని అనంతపురం ఎస్పీ గౌతమిశాలి సూచించారు. చట్టాన్ని చేతిలో తీసుకొని శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే ఉపేక్షించేది లేదని ఆమె పేర్కొన్నారు. ఆదివారం ఆమె మీడియాతో మాట్లాడుతూ.. శాంతి భద్రతలకు భంగం కలిగించే వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామన్నారు.