ఎక్కువ మాట్లాడితే నీ పదవి ఊడుతుందని ఒకరు, నువ్వు ఊ…… అంటే ఊడిపోవడానికి అదేమీ నీ మనుషులు తయారు చేసిన కుర్చీ కాదు, ప్రజలిచ్చిన పోస్ట్ అని మరొకరు సవాళ్ళతో రాజకీయాన్ని రక్తి కట్టిస్తున్నారు. వస్తా… సంగతేంటో చూస్తానని ఒకరు, రా… చూద్దాం…. అయామ్ వెయిటింగ్ అంటూ ఇంకొకరు సినిమా డైలాగ్స్‌తో యవ్వారాన్ని యమా రక్తి కట్టిస్తున్నారు. ఆచరణ సాధ్యంకాని ఆ సవాళ్ళు విసురుకుంటున్న ఇద్దరూ ఎవరు? వాతావరణం ఎందుకంత వేడెక్కింది? Also Read:Botsa Satyanarayana :…
అనంతపురం నగరపాలక సంస్థలో ప్రస్తుతం వైసీపీ క్లియర్ కట్ మెజార్టీతో పీఠంపై ఉంది. మొత్తం 50 డివిజన్లు ఉండగా.. 48 చోట్ల వైసీపీ అభ్యర్థులు గెలిచారు. ఇద్దరు స్వతంత్ర అభ్యర్థులు విజయం సాధించారు. వారిద్దరు కూడా వైసీపీకి మద్దతు పలికారు. అయితే ఏ మాత్రం రాజకీయ అనుభవం లేని వసీం సలీంని మేయర్ పీఠంపై కూర్చోబెట్టారు. అది అప్పట్లో చాలామందికి నచ్చలేదు. పైగా అనంత వెంకటరామిరెడ్డికి మేయర్ వసీంకి వ్యతిరేకంగా కార్పొరేటర్లు చాలామంది ఉన్నారు.