కరోనా వైరస్‌కు ఆయుర్వేద మందు తయారు చేస్తూ ఇప్పుడు సెలబ్రిటీగా మారిపోయారు ఆనందయ్య.. ఆయన తయారు చేస్తూ.. కరోనా రోగులకు ఉచితంగా పంపిణీ చేస్తున్న మందులోని శాస్త్రీయతను తేల్చేపనిలో పడిపోయారు అధికారులు.. ఇదే సమయంలో.. ఆనందయ్యను అరెస్ట్ చేసినట్టు వార్తలు గుప్పుమన్నాయి.. కృష్ణపట్నంలో ఆనందయ్యను పోలీసులు అరెస్ట్ చేసి తీసుకెళ్లారని పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది.. అయితే దీనిపై స్పందించిన నెల్లూరు జిల్లా ఎస్పీ భాస్కర్ భూషణ్.. వివరణ ఇస్తూ.. ఆనందయ్యను అరెస్ట్ చేయలేదని…