టీడీపీ అధినేత నారా చంద్రబాబు జిల్లాల పర్యటన బుధవారం నుంచి ప్రారంభం కానుంది. ఎన్టీఆర్ స్ఫూర్తి- చంద్రన్న భరోసా పేరుతో చంద్రబాబు జిల్లాల పర్యటన చేపడుతున్నారు. ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాల్లో భాగంగా పలు జిల్లాలలో మినీ మహానాడు కార్యక్రమాలను నిర్వహించాలని చంద్రబాబు నిర్ణయించారు. ఈ మేరకు అనకాపల్లి జిల్లా చోడవరంలో జరగనున్న తొలి మహానాడుతో చంద్రబాబు జిల్లాల పర్యటన ప్రారంభం కానుంది. వైసీపీ ప్రభుత్వ వైఫల్యాలను, జగన్ విధ్వంసకర పాలనను ఎండగడుతూ ప్రజల భవిష్యత్‌కు భరోసా…
అనకాపల్లి జిల్లాలో సీఎం జగన్ పర్యటిస్తున్నారు. సబ్బవరం మండలం పైడివాడ అగ్రహారంలో 1.23 లక్షల ఇళ్లపట్టాల పంపిణీని సీఎం జగన్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో 30.70 లక్షల మందికి ఇళ్ల పట్టాలు ఇచ్చామని తెలిపారు. మరోవైపు 15.60 లక్షల ఇళ్ల నిర్మాణం కూడా ప్రారంభమైందని వెల్లడించారు. గజం 12 వేలికే చోట రూ.6 లక్షలు విలువైన ఇళ్లస్థలాన్ని పేదలకు ఇచ్చామని తెలిపారు. ఇంటి నిర్మాణం, మౌలిక సదుపాయాలతో కలిపి రూ.10 లక్షల వరకు…
ఏపీ సీఎం జగన్ అనకాపల్లి జిల్లాలో పర్యటిస్తున్నారు. సబ్బవరం మండలం పైడివాడ అగ్రహారం లే అవుట్‌లో నిర్మించిన మోడల్ హౌస్‌ను సీఎం జగన్ పరిశీలించారు. వైఎస్ఆర్ పార్కులో దివంగత నేత ఎస్ఆర్ విగ్రహాన్ని ఆయన ఆవిష్కరించారు. అనంతరం ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.
వైసీపీలో మంత్రి పదవి దక్కని నేతల్లో అసంతృప్తి ఇంకా చల్లారడం లేదు. తాజాగా అనకాపల్లి జిల్లా పాయకరావుపేట వైసీపీ ఎమ్మెల్యే గొల్ల బాబూరావు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. కోటవురట్లలో సోమవారం వాలంటీర్లకు సన్మాన కార్యక్రమంలో పాల్గొన్న ఆయన.. కేబినెట్‌లో చోటు విషయంపై తనకు ముమ్మాటికీ అన్యాయం జరిగిందన్నారు. మంత్రి పదవి ఇవ్వకుండా అధిష్టానం దెబ్బకొట్టిందని.. తానూ అవకాశం వచ్చినప్పుడు దెబ్బకొడతానని అన్నారు. వైఎస్ఆర్ చనిపోయిన తరువాత హింసావాదంతో తాను జగన్ ఏర్పాటు చేసిన వైసీపీలో జాయిన్…
అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో కరెంట్ కోతలు అధికంగా ఉన్నాయి. ఈ క్రమంలో ఎన్టీఆర్ ప్రభుత్వాస్పత్రిలో జనరేటర్ కూడా పనిచేయడం లేదు. దీంతో అర్ధరాత్రి 11 గంటల సమయంలో కృష్ణదేవిపేట నుంచి వచ్చిన ఓ గర్భిణీ పురిటినొప్పులతో బాధపడింది. కరెంట్ లేకపోవడంతో సెల్‌ఫోన్ లైట్ల మధ్యనే వైద్యులు ఆమెకు డెలివరీ చేశారు. ఆ సమయంలో గ్రామంలో ఆస్పత్రి స్టాఫ్‌కు కొవ్వొత్తులు కూడా దొరకని పరిస్థితి ఏర్పడింది. మరోవైపు ప్రసూతి విభాగంలో ఉన్న చంటిబిడ్డ తల్లులు, అప్పుడే పుట్టిన పిల్లలు…