ఆఫ్ఘనిస్తాన్ మొత్తం ఇప్పుడు తాలిబన్ల వశం అయింది. అక్కడ తాలిబన్ల ప్రభుత్వం ఏర్పాటైంది. ప్రస్తుతం తాత్కాలిక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినా, పూర్తిస్తాయిలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి ప్రపంచదేశాల గుర్తింపు పొందేందుకు ప్రయత్నం చేస్తున్నారు. అయితే, తాలిబన్ల ప్రభుత్వాన్ని గుర్తించకుంటే ఆఫ్ఘన్ ప్రజలు ఇబ్బందులు పడే అవకాశం ఉన్నది. ఆఫ్ఘనిస్తాన్‌లో తాలిబన్ల ప్రభుత్వాన్ని గుర్తించేందుకు కొన్నిదేశాలు ఇప్పటికే సిద్ధంగా ఉన్నాయి. ఆర్ధికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న ఆఫ్ఘనిస్తాన్ తాత్కాలిక ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. గత ప్రభుత్వంలోని మాజీనేతల…
ఆఫ్ఘనిస్థాన్ సంక్షోభం కొనసాగుతూనే ఉంది.. ఓవైపు పూర్తిస్థాయిలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు తాలిబన్లు ప్లాన్ చేస్తుండగా.. మరోవైపు.. పంజ్‌షీర్‌లో తాలిబన్లకు తీవ్ర ప్రతిఘటన ఎదురవుతోంది… అయితే, ఆఫ్ఘన్ అధ్యక్షుడు దేశం విడిచి వెళ్లిపోయిన తర్వాత తానే తాత్కాలిక అధ్యక్షుడిగా ప్రకటించుకున్న అమ్రుల్లా సలేహ్ కూడా ఆఫ్ఘన్‌ను వీడారు.. అధ్యక్షుడు లేని సమయంలో నిబంధనల ప్రకారం తానే తాత్కాలిక అధ్యక్షుడిని అని ప్రకటించుకుని పంజ్‌షీర్ వెళ్లిన ఆయన.. తాలిబన్లపై పోరాటానికి పంజ్‌షీర్ ప్రజలు, అక్కడి ప్రజలు, ఆప్ఘన్ సైన్యం…
ఆఫ్ఘనిస్తాన్ మొత్తం తాలిబన్ల వశం అయినప్పటికీ ఉత్తర భాగంలో ఉన్న పంజ్‌షీర్ ప్రావిన్స్ మాత్రం వారికి దక్కలేదు. ఆ ప్రాంతం కోసం తాలిబన్లు పోరాటం చేస్తున్నారు. నిన్నటి రోజున జరిగిన పోరాటంలో 300 మంది తాలిబన్లను మట్టుబెట్టినట్టు పంజ్‌షీర్ ఫైటర్స్ పేర్కొన్నారు. పంజ్‌షీర్ ఫైటర్స్‌కు మాజీ ముజాహిదీన్ నేత అహ్మద్ షా కుమారుడితో పాటు, ఆఫ్ఘన్ ఉపాధ్యక్షుడు అమ్రుల్లా సలేహ్ నాయత్వం వహిస్తున్నారు. ఆఫ్ఘన్ రద్దుచేసిన సాయుధ సిబ్బందితో పాటుగా, స్థానికి మిలీషియా దళంతో కలిసి తాలిబన్లపై…
ఆఫ్ఘనిస్తాన్‌ను తాలిబన్లు ఆక్రమించుకున్నాక అక్కడి పరిస్థితులు దారుణంగా మారిపోయాయి. తాలిబన్లకు పాకిస్తాన్ సహాయం చెసిందని అనేక దేశాలు ఆరోపిస్తున్నాయి. పాక్‌లో ఉగ్రవాద సంస్థలు అనేకం ఆశ్రయం పోందుతున్నాయి. తాలిబన్లు ఆక్రమించుకునే ముందు రోజు ఆ దేశ అధ్యక్షుడు అష్రాఫ్ ఘనీ దేశం విడిచి పారిపోయారు. అయితే, ప్రస్తుతం ఉపాద్యక్షుడు తాలిబన్లపై పోరాటం చేసేందుకు సిద్ధం అవుతున్నాడు. ఆఫ్ఘన్‌ను తనలో కలుపుకునేంత దమ్ము పాక్‌కు లేదని, పాలించేంతటి సీన్ తాలిబన్లకు లేదని మాజీ ఉపాధ్యక్షుడు అమ్రుల్లా సలేహ్ పేర్కొన్నారు.…
ఆఫ్ఘన్‌లో పరిస్థితిలు చాలా వేగంగా మారిపోయాయి.. ఎవ్వరూ ఊహించని తరహాలో తాలిబన్లు ఆఫ్ఘన్‌పై పట్టు సాధిస్తూ తక్కువ సమయంలో ఆ దేశాన్ని తమ ఆధీనంలోకి తెచ్చుకున్నారు. దీంతో.. ఆ దేశ అధ్యక్షుడు అష్రఫ్ ఘనీ.. ఆఫ్ఘన్‌ను విడిచి పరారయ్యాడు.. ఖరీదైన కార్లతో పాటు.. పెద్ద ఎత్తున క్యాష్‌ను తన వెంట తీసుకొని వెళ్లాడని ప్రచారం జరిగింది.. అయితే, ఇప్పుడు తానే ఆపద్ధర్మ అధ్యక్షుడిని అంటూ తెరపైకి వచ్చారు ఉపాధ్యక్షుడు అమ్రుల్లా సలేహ్.. అధ్యక్షుడు దేశాన్ని విడిచి వెళ్లిపోవడంతో…
ఆఫ్ఘనిస్తాన్ నుంచి నాటో, అమెరికా దళాలు తప్పుకోవడంతో తాలిబన్లు రెచ్చిపోతున్నారు. అమాయక ప్రజలపై దాడులు చేస్తున్నారు. ఆఫ్ఘన్ ఆర్మిని చెదరగోడుతూ అనేక ప్రాంతాలను స్వాదీనంలోకి తీసుకుంటున్నారు. ఇక పాక్ ఇప్పటికే తాలీబన్లకు మద్దతు ఇస్తున్నది. దీంతో వారు మరింతగా రెచ్చిపోతున్నారు. మరోవైపు పాక్ ట్రోలర్లు ట్వట్టర్లో ఆఫ్ఘనిస్తాన్‌ను ట్రోల్ చేస్తున్నారు. మంగళవారం రోజున బక్రీద్ సందర్భంగా అధ్యక్షభవనంలో సామూహిక ప్రార్ధనలు నిర్వహించారు. ఈ ప్రార్ధనల్లో అధ్యక్షుడితో పాటు ఉపాద్యక్షుడు అమ్రుల్లా సలే కూడా పాల్గోన్నారు. ప్రార్ధనలు జరిగే…