పంజాబ్‌లో ఘోర రైలు ప్రమాదం తప్పింది. అమృత్‌సర్-సహర్సా గరీబ్ రథ్ ఎక్స్‌ప్రెస్‌లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో రైలును ఆపడానికి ఒక ప్రయాణీకుడు గొలుసు లాగాడు. దీంతో ట్రైన్ ఆగడంతో వెంటనే ప్రయాణికులంతా కోచ్ నుంచి సురక్షితంగా బయటకు దిగేశారు. ఈ క్రమంలో పలువురి ప్రయాణికులకు స్వల్పగాయాలు అయినట్లు అధికారి తెలిపారు.