మధ్యతరగతి కుటుంబాల జీవితాల్లోని స్వప్నాలు, ఆశలు, ఆవేదనలను హృదయానికి హత్తుకునేలా సిద్ధార్థ్ ‘3 BHK’ ట్రైలర్ కట్ చేశారు.. సిద్ధార్థ్ నటిస్తున్న 40వ చిత్రంగా రూపొందిన ఈ సినిమా, శ్రీ గణేష్ దర్శకత్వంలో శాంతి టాకీస్ బ్యానర్‌పై అరుణ్ విశ్వ నిర్మించారు. ఈ రోజు విడుదలైన ఈ చిత్ర ట్రైలర్, ప్రేక్షకుల హృదయాలను కదిలించేలా ఒక ఎమోషనల్ జర్నీలా అనిపించింది. ఒక సామాన్య కుటుంబం సొంత ఇల్లు కొనాలనే జీవన్మరణ కల చుట్టూ ఈ సినిమా తిరుగుతుందని…