2047 నాటికి దేశాన్ని అభివృద్ధి చెందిన భారత్‌గా తీర్చిదిద్దాలన్న తన సంకల్పాన్ని పునరుద్ఘాటించిన ప్రధాని నరేంద్ర మోడీ.. దేశాన్ని మహిమాన్వితంగా తీర్చిదిద్దుతామని ఈ గడ్డపై ప్రమాణం చేస్తున్నానన్నారు. అంతకు ముందు దేశ నేలకు నమస్కరించి.. ప్రపంచంలోని గొప్ప నాగరికతలు అంతరించిపోయాయని, అయితే ప్రాచీన కాలం నుంచి నేటి వరకు ఈ జాతిని కాపాడిన చైతన్యం భారత నేలకు ఉందన్నారు.