ఈనెల 6న ప్రధాని నరేంద్ర మోడీ దేశంలోని 508 రైల్వే స్టేషన్‌ల ఆధునికీకరణ పనులకు శంకుస్థాపన చేయనున్నారు. ఆదివారం ఉదయం 11 గంటలకు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టునున్నారు. రూ.24,470 కోట్ల వ్యయంతో అమృత్ భారత్ స్టేషన్ స్కీమ్ కింద కేంద్రం ఈ పనులకు చేపడుతోంది.