అమ్మ అంటే ఆలనా, ఆప్యాయత, అనురాగం. అలాంటి అమ్మ విలువను గుర్తు చేస్తూ రూపొందిన సందేశాత్మక షార్ట్ ఫిల్మ్ ‘అమ్మ’. ఏఏఆర్ ఫిల్మ్ మేకర్స్ సమర్పణలో, ‘నాట్యమార్గం’ సహకారంతో తెరకెక్కిన ఈ చిత్రం మదర్స్ డే సందర్భంగా మే 11న ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రముఖ నృత్యకారిణి అభినయశ్రీ ఇంద్రాణి దవలూరి ఈ చిత్రంలో ‘అమ్మ’ పాత్రలో మెప్పించనున్నారు. గతంలో ఆమె నటించిన అందెల రవమిది చిత్రం విడుదలకు ముందే పలు ప్రతిష్ఠాత్మక అవార్డులను సొంతం చేసుకుంది.…