ప్రముఖ బాలీవుడ్ నటుడు అమితాబ్ బచ్చన్ కొన్ని రోజుల క్రితం సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఎక్స్‌లో ఓ పోస్ట్‌ను పంచుకున్నారు. 'ఇది వెళ్ళే సమయం...' అని ఆయన ట్వీట్ చేశారు. దీంతో ఒక్కసారిగా అభిమానులు కంగారు పడ్డారు. సోషల్ మీడియాలో రిటైర్మెంట్‌పై పెద్ద ఎత్తున చర్చ మొదలైంది. ఈ ఊహాగానాలకు, తాను చేసిన ట్వీట్‌కు అమితాబ్ బచ్చన్ క్లారిటీ ఇచ్చారు.