కర్ణాటకలో 2023లో ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో బీజేపీ సీనియర్ నేత, కేంద్ర హోంమంత్రి కీలక నిర్ణయం తీసుకున్నారు. 2023 ఎన్నికలకు ముందు కేఎస్ ఈశ్వరప్ప, రమేష్ జార్కిహోళి వంటి అసంతృప్తితో ఉన్న బీజేపీ ఎమ్మెల్యేలకు కేబినెట్‌లో స్థానం కల్పించేందుకు కర్ణాటక ప్రభుత్వ మంత్రివర్గ విస్తరణకు కేంద్ర మంత్రి అమిత్ షా ఆమోదం తెలిపారు.