Donald Trump and Pm Modi Meeting: అమెరికాలోని మిచిగాన్‌లో జరిగిన ప్రచార కార్యక్రమంలో అమెరికా వాణిజ్యంపై మాట్లాడిన అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వచ్చే వారం ప్రధాని మోదీని కలుస్తానని ప్రకటించారు. ఈ ఏడాది నవంబర్‌లో అమెరికాలో అధ్యక్ష ఎన్నికలు జరగబోతున్న నేపథ్యంలో ఈ మాటలకి ఇప్పుడు ప్రాచుర్యం ఏర్పడింది. దీనికి సంబంధించి ఎన్నికల ప్రచారం శరవేగంగా సాగుతోంది. ఈ ఎన్నికల ప్రచారంలో రిపబ్లికన్ అభ్యర్థి ట్రంప్ వచ్చే వారం ప్రధాని మోడిని కలుస్తానని…
సీఎం రేవంత్ రెడ్డి అమెరికా టూర్ పై కేటీఆర్ విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ క్రమంలో మంత్రి కొండా సురేఖ ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం రేవంత్ రెడ్డి అమెరికా వెళ్ళింది ఆయన తమ్ముడి కంపెనీ కోసం అని కేటీఆర్ విమర్శలు చేస్తున్నారని.. కేటీఆర్ గతంలో అమెరికా వెళ్ళినప్పుడు ఏం చేశారో, ఎటువంటి ఒప్పందాలు చేసుకున్నారో తెలుసన్నారు. పదేళ్లు బీఆర్ఎస్ నేతలు పందికొక్కుల్ల దోచుకుతిన్నారని మండిపడ్డారు.
సీఎం వైఎస్ జగన్ ని అమెరికాలో పర్యటించిన ప్రభుత్వ విద్యార్థుల బృందం కలిసింది. అమెరికా పర్యటన వివరాలను సీఎం అడిగి తెలుసుకున్నారు. వరల్డ్ బ్యాంక్, ఐఎంఎఫ్, కొలంబియా యూనివర్శిటీ, ఇంటర్నేషనల్ యూత్ కాన్ఫరెన్స్‌లో విద్యార్థులు పాల్గొన్నారు. త
NATO : గత కొన్నేళ్లుగా భారత్-అమెరికా మధ్య స్నేహం చాలా బలంగా మారింది. దీని ఫలితం వ్యాపారం రంగంలో కూడా కనిపించింది. రక్షణ రంగంలో కూడా ఇరు దేశాలు దగ్గరయ్యాయి. ఈ ఎపిసోడ్‌లో, నాటో ప్లస్‌లో భారత్‌ను చేర్చాలని అమెరికాలో సిఫార్సు చేయబడింది. వాస్తవానికి ప్రధాని నరేంద్ర మోదీ వచ్చే నెలలో అమెరికా పర్యటనకు వెళ్లనున్నారు.
విద్యార్ధి జీవితం మరపురాని అనుభూతినిస్తుంది. ఎక్కడో పుట్టి, ఎక్కడో చదువుకుని మళ్ళీ తమ స్వంత గడ్డపై అడుగుపెట్టాక పాత జ్ఞాపకాల్ని గుర్తుచేసుకుంటే ఆ ఆనందం మామూలుగా వుండదు. తెలంగాణ రాష్ట్ర మంత్రిగా అనేక ప్రపంచస్థాయి కంపెనీలను తెలంగాణకు తీసుకురావడంలో విజయం సాధించిన మంత్రి కేటీఆర్ అమెరికా టూర్‌లో బిజీగా వున్నారు. తాను గతంలో చదువుకున్న న్యూయార్క్ నగరంలో తన విద్యార్థి మరియు ఉద్యోగ జీవిత కాలానికి సంబంధించిన జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. తన బిజీ షెడ్యూల్ మధ్యలో…
తెలంగాణ మంత్రి కె. తారకరామారావు అమెరికా పర్యటనలో బిజీగా వున్న సంగతి తెలిసిందే. తెలంగాణలో సుమారు 150 కోట్లకు పైగా పెట్టుబడులు పెట్టనుంది కెమ్ వేద లైఫ్ సైన్సెస్. హైద్రాబాద్ లో అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో కూడిన రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ సెంటర్ ఏర్పాటు చేయనుంది. హైదరాబాద్ ఫార్మా లైఫ్ సైన్సెస్ రీసెర్చ్ ఈకో సిస్టంను ఈ డెవలప్మెంట్ సెంటర్ మరింత బలోపేతం చేస్తుందని చెబుతున్నారు మంత్రి కేటీఆర్. హైదరాబాద్ ఫార్మాసిటీలో ఏర్పాటుచేయబోయే ఫార్మా యూనివర్సిటీలో భాగం…