Vinay Kumar: రష్యాలో భారత రాయబారిగా వినయ్ కుమార్‌ని నియమించినట్లు భారత విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ(ఎంఈఏ) తెలియజేసింది. ప్రస్తుతం మయన్మార్‌లో భారత రాయబారిగా ఉన్న 1992 బ్యాచ్ ఐఎఫ్ఎస్ అధికారి వినయ్ కుమార్, త్వరలోనే తన బాధ్యతలు చేపడుతారని ఎంఈఏ తెలియజేసింది. ఇటీవల రష్యాలో ఎన్నికలు జరిగాయి, మరోసారి పుతిన్ భారీ మెజారిటీతో రష్యా అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. ఆయన గెలుపు తర్వాత ఈ నియామకం చోటు చేసుకుంది.