Amaravati Development: ఆంధ్రప్రదేశ్‌లోని కూటమి సర్కార్.. రాజధాని అమరావతి ప్రాంత గ్రామాలకు శుభవార్త చెప్పింది.. ఆయా గ్రామాల్లో మౌలిక వసతుల అభివృద్ధి కోసం ప్రభుత్వం భారీగా నిధులు మంజూరు చేస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. రాజధాని పరిధిలోని కృష్ణాయపాలెం, వెంకటపాలెం, పెనుమాక, ఉండవల్లి గ్రామాల్లో మౌలిక వసతుల కల్పనకు ప్రభుత్వం రూ.1,863 కోట్ల మొత్తానికి పరిపాలనా అనుమతి ఇచ్చింది. ఈ నిధులతో లేఅవుట్లలో రోడ్లు, కాలువలు, నీటి సరఫరా, మురుగునీటి పారుదల వ్యవస్థలను ఏర్పాటు చేయనుంది. అలాగే…