Minister Narayana: రాజధాని ప్రాంత రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై ఏర్పాటు చేసిన త్రి-మెన్ కమిటీ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చ జరిగింది అని మంత్రి నారాయణ తెలిపారు. ఈ సమావేశంలో గ్రామ కంఠం, జరీబు, నాన్-జరీబు భూములకు సంబంధించిన సమస్యలే ప్రధానంగా ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. ఇప్పటి వరకు 29,233 మంది రైతులకు ప్లాట్ల అలాట్‌మెంట్ పూర్తయ్యిందని మంత్రి వెల్లడించారు. అయితే రాజధాని భూములకు సంబంధించి 312 కోర్టు కేసులు ఇప్పటికీ పెండింగ్‌లో ఉన్నాయని తెలిపారు.…