Minister Narayana: రాజధాని ప్రాంత రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై ఏర్పాటు చేసిన త్రి-మెన్ కమిటీ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చ జరిగింది అని మంత్రి నారాయణ తెలిపారు. ఈ సమావేశంలో గ్రామ కంఠం, జరీబు, నాన్-జరీబు భూములకు సంబంధించిన సమస్యలే ప్రధానంగా ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. ఇప్పటి వరకు 29,233 మంది రైతులకు ప్లాట్ల అలాట్‌మెంట్ పూర్తయ్యిందని మంత్రి వెల్లడించారు. అయితే రాజధాని భూములకు సంబంధించి 312 కోర్టు కేసులు ఇప్పటికీ పెండింగ్‌లో ఉన్నాయని తెలిపారు. వీధి పోటు సమస్యలు, వారసత్వ వివాదాలు, అలాగే ఎన్‌ఆర్‌ఐల కారణంగా కొన్ని ప్లాట్ల రిజిస్ట్రేషన్లు జరగలేదని చెప్పారు.
Read Also: Dhurandhar: హృతిక్ వ్యాఖ్యలపై దర్శకుడు స్పందన.. ‘ధురంధర్ పార్ట్ 2’పై క్లారిటీ ఇచ్చిన ఆదిత్య ధర్
భూ సమీకరణ జరగని భూముల్లో కూడా 921 ప్లాట్లు రైతులకు కేటాయించినట్లు మంత్రి నారాయణ వివరించారు. రైతుల అభిప్రాయాలను తెలుసుకునేందుకు వీఆర్‌ఎస్ (VRS) విధానం ద్వారా సర్వే నిర్వహించామని, అందులో కొందరు రైతులు వేరే చోట ప్లాట్లు తీసుకోవడానికి సమ్మతించగా, మరికొందరు వేచి చూస్తామని, ఇంకొందరు తర్వాత నిర్ణయం తీసుకుంటామని చెప్పినట్లు తెలిపారు. రైతులకు కేటాయించిన ప్లాట్లలో 7,628 ప్లాట్ల రిజిస్ట్రేషన్ వివిధ కారణాల వల్ల పెండింగ్‌లో ఉందని మంత్రి నారాయణ పేర్కొన్నారు. అయితే 1,697 ప్లాట్ల రిజిస్ట్రేషన్‌కు ఎలాంటి ఇబ్బంది లేదని స్పష్టం చేశారు. అలాగే కొందరు రైతులు ఎఫ్‌ఎస్‌ఐ (FSI) పెంచాలని డిమాండ్ చేసిన విషయాన్ని మంత్రి వెల్లడించారు. రైతుల సమస్యలను దశలవారీగా పరిష్కరించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని, త్రి-మెన్ కమిటీ చర్చల ఆధారంగా తగిన నిర్ణయాలు తీసుకుంటామని ఆయన తెలిపారు.