Waqf Bill: ఎన్డీయే ప్రభుత్వం తీసుకువచ్చిన చారిత్రాత్మక ‘‘వక్ఫ్ సవరణ బిల్లు-2025’’ని పార్లమెంట్ ఆమోదించింది. రాష్ట్రపతి సంతకంతో బిల్లు చట్టంగా మారబోతోంది. పార్లమెంట్‌లో చర్చ సందర్భంగా బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే పార్టీలు బిల్లుకు మద్దతు పలికాయి. కాంగ్రెస్, ఎస్పీ, ఆప్, ఎంఐఎం, టీఎంసీ వంటి ఇండీ కూటమి పార్టీలు బిల్లుకు వ్యతిరేకంగా ఓటేశాయి. ఎన్డీయే ప్రభుత్వానికి సంఖ్యా బలం ఉండటంతో బిల్లు సులభంగానే పాస్ అయింది.
ఆప్ ఎమ్మెల్యే అమానతుల్లా ఖాన్‌ను ఢిల్లీ కోర్టు 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీకి పంపింది. మనీలాండరింగ్ కేసులో14 రోజుల పాటు జ్యుడీషియల్ కస్టడీకి పంపాలని కేంద్ర దర్యాప్తు సంస్థ ఈడీ స్వయంగా కోర్టును అభ్యర్థించింది. ఇకపై నిందితులను కస్టడీలో విచారించాల్సిన అవసరం లేదని ప్రత్యేక న్యాయమూర్తికి ఈడీ తెలిపింది.
పెట్రోల్ పంప్ వర్కర్‌పై దాడి చేసిన కేసులో ఆమ్ ఆద్మీ పార్టీ ఎమ్మెల్యే అమానతుల్లా ఖాన్, అతని కుమారుడు అనాస్‌లను అరెస్ట్ చేసేందుకు నోయిడా పోలీసులు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. ఈ రోజు కూడా నోయిడా పోలీసులు అమానతుల్లా ఖాన్ ఇంటికి చేరుకోగా.. అతను ఇంట్లో కనిపించలేదు.