మహిళల వన్డే ప్రపంచకప్ 2025 ఆసాంతం బాగా ఆడి.. కీలక సెమీఫైనల్లో ఓడి టోర్నీ నుంచి తప్పుకోవడం చాలా బాధగా ఉందని ఆస్ట్రేలియా కెప్టెన్ అలీసా హీలీ తెలిపింది. బహుశా ఇంతలా బాధపడడం ఇదే మొదటిసారి అనుకుంటున్నా అని చెప్పింది. బ్యాటింగ్, ఫీల్డింగ్, బౌలింగ్‌లో సమష్టిగా విఫలమవడమే తమ ఓటమికి కారణం అని స్పష్టం చేసింది. 2029లో జరిగే వన్డే వరల్డ్‌కప్‌లో తాను ఆడనని, అప్పటి జట్టు కొత్తగా ఉంటుందని హీలీ చెప్పుకొచ్చింది. గురువారం భారత్‌పై 338…