ఏపీలో టీడీపీ వర్సెస్ వైసీపీ వార్ నడుస్తోందా? టీడీపీ నేతల వరుస అరెస్ట్ లు దానికి సంకేతమా? అంటే అవుననే అనిపిస్తోంది. కడప, అనంతపురం పర్యటనల్లో టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు టీడీపీ నేతల్ని వేధించడంపై మండిపడ్డ సంగతి తెలిసిందే. తాజాగా విజయవాడ శివారులో టీడీపీ నేతను పోలీసులు అరెస్ట్ చేయడం కలకలం రేపుతోంది. గొల్లపూడిలో టీడీపీ నాయకుడు ఆలూరి హరికృష్ణ చౌదరి చిన్నాను అరెస్ట్ చేశారు పోలీసులు. శుక్రవారం అర్ధరాత్రి చిన్నాని అరెస్ట్ చేసి వన్ టౌన్…