తెలంగాణ మలిదశ తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలకంగా వ్యవహరించి, మహిళా జేఏసీలో చురుకైన పాత్ర పోషించిన వారిలో అల్లం పద్మ ఒకరు. ఆమెని తెలంగాణ ఉద్యమకారులు, విద్యార్ధులు చిరకాలం గుర్తుంచుకుంటారు. ఉస్మానియా విద్యార్థుల ఆకలి తీర్చి అమ్మల సంఘం అధ్యక్షురాలిగా కొనసాగిన అల్లం పద్మ అస్వస్థతతో కన్నుమూశారు. గత 24 ఏళ్లుగా కిడ్నీ సంబంధిత వ్యాధితో జీవన్మరణ పోరాటం చేస్తూనే అప్పట్లో ఉద్యమంలో, ఇప్పటికీ అనేక కార్యక్రమాల్లో పాల్గొంటూ వచ్చిన ఆమె గత 20 రోజులుగా నిమ్స్ ఆసుపత్రిలో…