కట్టుకున్న భర్తే.. ఆమె పాలిట కాల యముడయ్యాడు. నిత్యం అనుమానిస్తుండడంతో దూరంగా ఉంటున్న ఆమెను నమ్మించి అత్యంత దారుణంగా కడతేర్చాడు. ఈ ఘటన నంద్యాల జిల్లాలో కలకలం సృష్టించింది. భార్య కాపురానికి రాలేదన్న కారణంతో భర్త.. ఆమెను ఇటుకలతో కొట్టి చంపేశాడు. ఇక్కడ చూడండి.. విగత జీవిగా పడి ఉన్న ఈమె పేరు లక్ష్మీ పార్వతి. ఆమె స్వస్థలం నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ మండలం కృష్ణాపురం. ఈమెకు చింతకుంటకు చెందిన నల్లగట్ల శేషగిరితో వివాహమైంది. వారిద్దరికీ నలుగురు…