టీమిండియా మాజీ ఆటగాడు హర్భజన్ సింగ్ ఐపీఎల్‌లో తన ఆల్‌టైం ప్లేయింగ్ ఎలెవన్‌ను ప్రకటించాడు. హర్భజన్ ప్రకటించిన జట్టులో ఓపెనర్లుగా క్రిస్‌గేల్, రోహిత్ శర్మ ఉన్నారు. ఐపీఎల్ చరిత్రలో అత్యధిక పరుగులు చేసిన విరాట్ కోహ్లీని వన్‌డౌన్ ప్లేయర్‌గా భజ్జీ పేర్కొన్నాడు. ఆ తర్వాతి స్థానాల్లో వరుసగా షేన్ వాట్సన్, ఏబీ డివిలియర్స్ ఉన్నారు. వికెట్ కీపర్‌గా ధోనీని హర్భజన్ ఎంచుకున్నాడు. ఈ టీమ్‌కు కెప్టెన్ కూడా ధోనీనే అని అతడు పేర్కొన్నాడు. తన జట్టులో ఆల్‌రౌండర్లుగా…