తిరుమలలో కొండ చరియలు విరిగిపడడం వల్ల స్వామివారిని దర్శనం చేసుకోలేని భక్తులకు మరో అవకాశం కల్పించింది టీటీడీ. కొండ చరియలు విరిగిపడిన ప్రాంతాన్ని పరిశీలించారు అదనపు ఇఓ ధర్మారెడ్డి. భక్తులకు భద్రతపై ప్రత్యేక ఫోకస్ పెట్టామని ఆయన చెప్పారు. నవంబర్ 18 నుంచి డిసెంబరు 10వ తేది వరకు దర్శన టిక్కెట్లు కలిగిన భక్తులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. ఆయా తేదీల్లో దర్శనం టికెట్లు వున్న భక్తులు రీ షెడ్యూల్ చేసుకునే అవకాశం కల్పిస్తామన్నారు.…