Alcohol Effects on Sleep: కొందరు నిద్ర బాగా పడుతుందని మద్యం తాగుతుంటారు. నిజానికిది నిద్రకు చేటే చేస్తుందని నిపుణులు చెబుతున్నారు. మందు తాగడం వల్ల గాఢ నిద్రలోకి జారుకోవచ్చని చాలా మంది భావిస్తుంటారు. బీరు తాగితే ఆదమరిచి నిద్రపోవచ్చనుకుంటారు. ఆల్కహాల్ తీసుకోవడం వల్ల త్వరగా నిద్రపట్టడం నిజమేగానీ.. అది పూర్తి నిద్రా వ్యవస్థనే ఇబ్బందులకు గురి చేస్తుంది.