Boeing 737-8 Max: అలస్కా ఎయిర్ లైన్స్‌కి చెందిన బోయింగ్ 737-8 మ్యాక్స్ విమానం దుర్ఘటన, ప్రపంచంతో పాటు దేశంలోని అన్ని ఎయిర్‌లైన్స్ కంపెనీలను షాక్‌కి గురిచేశాయి. బోయింగ్ 737-8 మ్యాక్స్ గాల్లో 16 వేల అడుగుల ఎత్తులో ఉండగా.. డోర్ ఊడిపోయింది. టేకాఫ్ అయి కొన్ని నిమిషాలే కావడం, ఎయిర్ పోర్టు దగ్గరగానే ఉండటంతో పెద్ద ప్రమాదం తప్పింది. 171 మంది ప్రయాణికులు, ఆరుగురు సిబ్బందితో క్షేమంగా ల్యాండ్ అయింది.
Alaska Airlines Boeing 737 MAX: అలస్కా ఎయిర్ లైన్స్‌కి చెందిన బోయింగ్ 737-9 MAX విమానం తృటిలో ఘోర ప్రమాదం నుంచి బయటపడింది. టేకాఫ్ అయిన కొద్ధి నిమిషాలకే గాలిలో ఉండగానే విమానం డోర్ తెరుచుకుంది. దీంతో విమానం ఒక్కసారిగా అత్యవసర పరిస్థితిని ఎదుర్కొంది. ప్రయాణికులు ఈ ఘటనను చిత్రీకరించారు. దీంట్లో మిడ్ క్యాబిన్ ఎగ్జిట్ డోర్ విమానం నుంచి పూర్తిగా విడిపోయినట్లు కనిపిస్తోంది.