మూడు రాజధానుల బిల్లు వెనక్కు తీసుకోవడంతోనే అంతా అయినట్లు కాదని టీడీపీ ఎమ్మెల్సీ పరుచూరి అశోక్‌బాబు అన్నారు. సీఆర్డీఏ యాక్ట్ 2014 ప్రకారం ప్రభుత్వం రైతులకు చేయాల్సినవి చాలా ఉన్నాయన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ .. అమరావతి రైతులకు ఇవ్వాల్సిన ప్లాట్లు, కౌలుకు సంబంధించిన వ్యవహారాలు కోర్టు పరిధిలో ఉన్నాయని, వాటన్నింటినీ ప్రభుత్వం పరిష్కరించి రైతులకు న్యాయం చేయాలని అశోక్ బాబు అన్నారు. రాజధానికి రూ.లక్షకోట్లు అవసరమవుతాయన్నది పచ్చి అబద్దమని ఆయన ఈ సందర్భంగా చెప్పారు.…