2024 గానూ ఏయన్నార్ జాతీయ పురస్కార వేడుకల ప్రధానోత్సవం అన్నపూర్ణ స్టూడియోలో అతిరథమహారధుల సమక్షంలో జరుగుతోంది. ఈ ఏడాది అవార్డును మెగాస్టార్ చిరంజీవికి ఇస్తున్నట్లు హీరో నాగార్జున గతంలోనే ప్రకటించగా ఆ పురస్కారం ప్రదానం ఘనంగా జరుగుతోంది. ఈ వేడుకకు బాలీవుడ్ నటుడు అమితాబ్ బచ్చన్ ముఖ్య అతిథిగా హాజరవగా ఆయన చేతుల మీదుగానే చిరంజీవికి అక్కినేని జాతీయ పురస్కారాన్ని ప్రదానం చేయనున్నారు. అక్కినేని జాతీయ పురస్కార వేడుకలకు దర్శకులు రాఘవేందర్ రావు, నిర్మాత అశ్వినీదత్, నిర్మాత…