తెలుగు చిత్రసీమలో నవలానాయకుడు అనగానే నటసమ్రాట్ అక్కినేని నాగేశ్వరరావు ముందుగా గుర్తుకు వస్తారు. ఆయన నటజీవితంలో పలు మేలుమలుపులన్నీ నవలాచిత్రాలే కావడం విశేషం. ఏయన్నార్ ను మహానటునిగా నిలిపిన ‘దేవదాసు’ చిత్రం శరత్ చంద్ర ఛటర్జీ రాసిన బెంగాలీ నవల ఆధారంగా తెరకెక్కింది. ఆ తరువాత బెంగాలీ నవలలతోనే ఏయన్నారు మంచి విజయాలను చవిచూశారు. మణిలాల్ బెనర్జీ రాసిన ‘స్వయంసిద్ధ’ ఆధారంగా రూపొందిన ‘అర్ధాంగి’లో అక్కినేని పిచ్చివాడుగా చేసిన అభినయం ఆకట్టుకుంది. మరో మహానటుడు యన్టీఆర్ తో…