నందమూరి బాలకృష్ణ కెరీర్‌లోనే అత్యంత భారీ బడ్జెట్‌తో రూపొందుతున్న చిత్రం ‘అఖండ 2’. తొలి భాగం ‘అఖండ’ సృష్టించిన ప్రభంజనం దృష్ట్యా, ఈ సీక్వెల్‌పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమా బడ్జెట్ డబుల్, ట్రిపుల్ స్థాయిలో పెరిగిందని, దాదాపు 150 కోట్ల నుంచి 200 కోట్ల వరకు అవుతుందని అంచనా వేస్తున్నారు. అయితే, ఈ భారీ బడ్జెట్‌లో 80-90 శాతం మొత్తాన్ని సినిమా విడుదల కాకముందే నాన్-థియేట్రికల్ రైట్స్ (ఓటీటీ, శాటిలైట్ హక్కులు) ద్వారా రికవరీ…