1984 డిసెంబర్ 3వ తేదీ అర్థరాత్రి మధ్యప్రదేశ్ లోని భోపాల్ లో జరిగిన ఘోర దుర్ఘటనను ఈ దేశ ప్రజలు ఎప్పటికీ మర్చిపోలేరు. ఈ నేపథ్యంలో వివిధ భారతీయ భాషల్లో ఇప్పటికే కొన్ని సినిమాలు వచ్చాయి. తాజాగా తెలుగులోనూ ‘తప్పించుకోలేరు’ పేరుతో ఓ మూవీ రూపుదిద్దుకుంది. ‘కొత్త కథ, ఉసురు, అయ్యప్ప కటాక్షం’ వంటి చిత్రాలను తెరకెక్కించిన రుద్రాపట్ల వేణుగోపాల్ (ఆర్.వి.జి.) ఈ సినిమాను తీశారు. దీనిని తలారి వినోద్ కుమార్ ముదిరాజ్, శ్రీనివాస్ మామిడాల, లలిత్…