మాజీ ఐఏఎస్ అధికారి, ప్రభుత్వ మాజీ సలహాదారు ఏకే గోయల్ ఇంట్లో ఇటీవల ఎన్నికల అధికారులు తనిఖీ చేసిన సంగతి తెలిసిందే. ఆయన ఇంట్లో నుంచి అక్రమంగా డబ్బు తరలిస్తున్నారనే ఆరోపణలు రావడంతో ఎలక్షన్ టాస్క్ ఫోర్స్ ఆకస్మిక దాడులు నిర్వహించింది. దీనిపై ముందుస్తుగా ఎలాంటి నోటీసులు ఇవ్వకుండానే సోదాలు చేయడాన్ని బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి సోమా భరత్ ఖండించారు. మంగళవారం ఏకే గోయల్‌తో కలిసి ఆయన మీడియా సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…