భారత సాయుధ దళాలు కొత్త బ్యాచ్ AK-203 అస్సాల్ట్ రైఫిల్స్‌ను పూర్తి స్థాయిలో పొందబోతున్నాయి. ఇది కలాష్నికోవ్ సిరీస్‌లో అత్యాధునికమైన వెర్షన్. ఈ రైఫిల్ నిమిషంలో 700 రౌండ్ల వరకు కాల్పులు జరపగలదు. 800 మీటర్ల రేంజ్‌ను కలిగి ఉంటుంది. ఇండో-రష్యన్ రైఫిల్స్ ప్రైవేట్ లిమిటెడ్ (IRRPL) ఉత్తరప్రదేశ్‌లోని అమేథిలో దీన్ని తయారు చేస్తున్నారు. ఇది భారత్- రష్యా మధ్య జాయింట్ వెంచర్. ‘షేర్’ పేరుతో ఏకే-203 రైఫిళ్లను తయారు చేస్తోంది.