అసలే ఆ నియోజకవర్గం వైసీపీకి కంచుకోట. అలాంటి చోట కలిసి పోరాడాల్సిన టీడీపీలో మూడు ముక్కలాట సాగుతోంది. సమీక్షలు పెట్టి క్లాస్‌లు తీసుకున్నా.. నేతల తీరు మారడం లేదట. గందరగోళంలో పడిన కేడర్ దిక్కులు చూస్తోందట. ఫ్లెక్సీలు చించేయడంతో టీడీపీలో కలకలంప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెంలో గడిచిన రెండు ఎన్నికల్లో టీడీపీ నుంచి పోటీ చేసి ఓడిపోయారు బూదాల అజితారావు. మొదటిసారి ఓడినప్పుడు ఏ విధంగా అయితే కేడర్‌కు కనిపించకుండా పోయారో.. రెండోసారీ నియోజకవర్గంలో అజితారావు అదే చేశారని…