నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శరద్ పవార్ సోమవారం మహారాష్ట్రలోని సతారాలో తన పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగించారు. తన సోదరుడి కుమారుడు అజిత్ పార్టీకి వ్యతిరేకంగా తిరుగుబాటు చేసి బీజేపీ, ఏక్‌నాథ్ షిండే నేతృత్వంలోని మహారాష్ట్ర ప్రభుత్వంలో చేరిన ఒకరోజు తర్వాత ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు.