కొత్త కథలు, డిఫరెంట్ కాన్సెప్ట్ మూవీస్ ఇప్పుడు ఆడియెన్స్‌ను ఎక్కువగా ఆకట్టుకుంటున్నాయి. కంటెంట్ ఉన్న చిత్రాలు బాక్సాఫీస్ వద్ద విజయాన్ని సాధిస్తున్నాయి. ప్రస్తుతం అలాంటి ఓ డిఫరెంట్ కంటెంట్ మూవీ రాబోతోంది. ప్రముఖ నటుడు అజయ్ ఘోష్ విలన్‌గా అయినా, కమెడియన్‌గా అయినా ప్రేక్షకుల్ని ఇట్టే ఆకట్టుకుంటారు. ప్రస్తుతం ఆయన ఓ డిఫరెంట్ కంటెంట్‌తో ఆడియెన్స్‌ను మెప్పించేందుకు రెడీ అయ్యారు. చాందినీ చౌదరి, అజయ్ ఘోష్ ప్రధాన పాత్రలుగా ‘మ్యూజిక్ షాప్ మూర్తి’ అనే చిత్రం రాబోతోంది.…