సంక్రాంతి పండుగ రోజుల్లో నందిగామ నియోజకవర్గంలో జరిగిన ఓ మహిళ హత్య స్థానికంగా కలకలం రేపింది. నందిగామ నియోజకవర్గం ఐతవరంలో నాగేంద్రమ్మ అనే మహిళ దారుణ హత్యకు గురైంది. ఈ నెల 15న నాగేంద్రమ్మ ఇంట్లో హత్య జరిగింది.. దీనిపై పోలీసులకు సమాచారం అందటంతో విచారణ చేపట్టగా కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి.