Aaradhya Bachchan: అభిషేక్ బచ్చన్, ఐశ్వర్యారాయ్ కూతురు ఆరాధ్య బచ్చన్ ఢిల్లీ హైకోర్టుని ఆశ్రయించారు. అనేక వెబ్‌సైట్లలో తన ఆరోగ్యం గురించి నకిలీ, తప్పుదారి పట్టించే సమాచారాన్ని తొలగించాలని కోరుతూ పిటిషన్ దాఖలు చేశారు. అంతకుముందు పిటిషన్‌లో ఆమెకు సంబంధించిన కంటెంట్‌ని తొలగించాలంటూ సెర్చ్ ఇంజన్ దిగ్గజం గూగుల్, ఎంటర్‌టైన్‌మెంట్ సోషల్ మీడియా అకౌంట్ బాలీవుడ్ టైమ్స్, ఇతర వెబ్‌సైట్‌లను ఢిల్లీ హైకోర్టు ఆదేశించింది. అయితే, దీనికి కొనసాగింపుగా ఆరాధ్య కొత్త పిటిషన్ దాఖలు చేశారు.