India PakistanTensions: భారత్- పాకిస్తాన్ సరిహద్దులో తీవ్ర ఉద్రిక్తత కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో ఆపరేషన్ సింధూర్ను ఇండియన్ ఆర్మీ ప్రారంభించింది. ఆపరేషన్ సింధూర్ పేరుతో దాయాది దేశంలోని 9 ఉగ్రవాద శిబిరాలపై భారత సైన్యం దాడులకు దిగింది.
సిరియాపై ఇజ్రాయెల్ డజన్ల కొద్దీ వైమానిక దాడులు నిర్వహించింది. సిరియా అంతటా క్షిపణులు ప్రయోగించింది. దీంతో బాంబు దాడులతో సిరియా దద్దరిల్లింది. తాజాగా సిరియా తిరుగుబాటుదారుల చేతుల్లోకి వెళ్లిపోయింది.
Israel-Hamas war: ఇజ్రాయెల్ దేశంపై ఇరాన్, హిజ్బుల్లాలు ఏ క్షణమైనా దాడి చేసే అవకాశం ఉందని అగ్ర దేశం అమెరికా అంచనా వేసింది. దీనిపై జీ- 7 దేశాలకు అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్ సమాచారాన్ని అందించినట్లు టాక్.
Iran-Pakistan: ఇరాన్-పాకిస్తాన్ మధ్య ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఇరాన్ ఇటీవల పాకిస్తాన్ లోని బలూచిస్తాన్ ప్రావిన్సుపై వైమానిక దాడి చేసింది. ఆ తర్వాత ఇరాన్ లోని సిస్తాన్ బలూచిస్తాన్‌పై పాక్ దాడులు చేసింది. ఈ నేపథ్యంలో ఇరు దేశాల మధ్య తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఇదిలా ఉంటే ఇటీవల ఇరాన్ లోని పాక్ సరిహద్దు ప్రాంతాల్లో 9 మంది పాకిస్తాన్ జాతీయులను గుర్తుతెలియని వ్యక్తులు కాల్చి చంపారు.
ఆఫ్ఘనిస్తాన్, పాకిస్థాన్ సరిహద్దుల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. సరిహద్దులోని ఖోస్ట్ ప్రావిన్సుతో పాటు కునార్‌లోని షెల్టాన్ జిల్లాలో పాక్ సైన్యం వైమానిక దాడులకు పాల్పడింది. ఈ దాడుల్లో దాదాపు 30 మంది మృతి చెందినట్లు తెలుస్తోంది. మృతుల్లో మహిళలు, చిన్నారులు కూడా ఉన్నారు .26 పాకిస్థాన్ విమానాలు ఈ దాడుల్లో పాల్గొన్నాయి. తాలిబన్ పోలీస్ చీఫ్ అధికార ప్రతినిధి ఈ దాడులను ధృవీకరించారు. శుక్రవారం రాత్రి 9 గంటల ప్రాంతంలో పాకిస్థాన్ సైన్యం దాడులకు పాల్పడినట్లు ఆయన…
నెల రోజుల క్రతం ఈజిప్ట్, అమెరికా చొరవతో ఇజ్రాయిల్ కాల్పుల విరమణను ప్రకటించింది. అయితే, కొన్ని రోజుల క్రితం ఇజ్రాయిల్ కొత్త ప్రభుత్వం ఏర్పాటయింది. గాజా సమస్యను సామరస్యంగా పరిష్కరించుకుంటారని అనుకున్నారు. కానీ, కొత్త ప్రభుత్వం ఏర్పాటైన మూడోరోజే గాజాపై ఇజ్రాయల్ బాంబుల వర్షం కురిపించింది. గాజాలోని ఖాన్ యూనిస్ ప్రాంతంలో హమాస్ ఉగ్రవాదులు ఉన్నారనే అనుమానంతో దాడులు చేసింది. అయితే, ఈ దాడుల్లో ఎంతమంది మరణించారు అనే విషయాన్ని బయటపెట్టలేదు. ప్రమాదకరమైన వాయువులు కలిగిన బెలూన్లను…