Thiruvananthapuram: కేరళ రాజధాని తిరువనంతపురం అంతర్జాతీయ విమానాశ్రయంలో ఫుల్ ఎమర్జెన్సీని విధించారు అధికారులు. కాలికట్ నుంచి సౌదీ అరేబియాలోని డమ్మామ్ వెళ్లాల్సిన విమానంలో హైడ్రాలిక్ వైఫల్యం తలెత్తినట్లు తెలుస్తోంది. దీంతో ఈ విమానాన్ని తిరువనంతపురం అంతర్జాతీయ విమానాశ్రయానికి డైవర్ట్ చేశారు.
Air India Express Issues Covid Guidelines For Travellers From UAE To India: ప్రపంచవ్యాప్తంగా మళ్లీ కోవిడ్ భయాలు నెలకొన్నాయి. చైనాలో భారీగా కేసులు, మరణాలు నమోదు అవుతుండటంతో పలు ప్రపంచ దేశాలు కూడా అప్రమత్తం అవుతున్నాయి. ఇప్పటికే భారత్ ఈ దిశగా చర్యలు తీసుకుంటోంది. టెస్టింగ్- ట్రేసింగ్- ట్రీట్మెంట్ ఫార్ములాతో ముందుకెళ్లాలని రాష్ట్రాలకు, కేంద్రపాలిత ప్రాంతాలకు ఆదేశాలు జారీ చేసింది. విదేశాల నుంచి వచ్చే ప్రయాణికులకు ఎయిర్ పోర్టుల్లో స్క్రీనింగ్ టెస్టులు చేయనున్నారు.
శనివారం దుబాయ్ విమానాశ్రయంలో దిగిన ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానంలో పాము కలకలం రేపింది. కోల్‌కతా నుంచి బయలుదేరిన బీ-737-800 విమానం కేరళ మీదుగా దుబాయ్ చేరుకోగా.. కార్గో హోల్డ్‌లో పాము కనిపించిందని, ఈ ఘటనపై ఏవియేషన్ రెగ్యులేటర్ డీజీసీఏ విచారణ జరుపుతోందని సీనియర్ అధికారి తెలిపారు.
Vijayawada to Sharjah: విజయవాడ నుంచి షార్జాకి నేరుగా రాకపోకలు సాగించే ఎయిరిండియా విమాన సర్వీసులు ఈ నెల 31 నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ ఎక్స్‌ప్రెస్ ఫ్లైట్ సోమవారం సాయంత్రం 6 గంటల 35 నిమిషాలకు విజయవాడలో బయలుదేరుతుంది. ఈ రెండు ప్రాంతాల మధ్య ఇదే తొలి విమాన సర్వీసు కావటం విశేషం. స్టార్టింగ్ ఆఫర్ కింద టికెట్ ప్రారంభ ధర 13,669 రూపాయలని అధికార వర్గాలు పేర్కొన్నాయి. షార్జా నుంచి విజయవాడకి సర్వీస్ ఛార్జ్…