అహ్మదాబాద్ ఎయిరిండియా విమాన ప్రమాదానికి సంబంధించిన ప్రాథమిక రిపోర్టుపై దేశ సర్వోన్నత న్యాయస్థానం విచారం వ్యక్తం చేసింది. జూన్ 12న అహ్మదాబాద్ ఎయిర్‌పోర్టు సమీపంలో ఎయిరిండియా విమానం కూలిపోయింది. దాదాపు 271 మంది ప్రాణాలు కోల్పోయారు. అనంతరం ప్రమాదంపై రెండు సంస్థలు దర్యాప్తు చేపట్టాయి.
అహ్మదాబాద్ ఎయిరిండియా విమాన ప్రమాదం జరిగి మూడు నెలలు గడిచింది. అయితే ఈ ప్రమాదానికి గల కారణాలు మాత్రం ఇంకా వెలువడలేదు. ఆ మధ్య కాలంలో 15 పేజీల ప్రాథమిక నివేదిక విడుదలైంది. అయితే ఈ నివేదిక తీవ్ర దుమారం రేపింది.
Air India Plane Crash Preliminary Report Reveals: అహ్మదాబాద్ ఎయిర్ ఇండియా విమాన ప్రమాద ఘటనపై ప్రాథమిక నివేదిక వెల్లడైంది. ఎయిర్ క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగెంట్ బ్యూరో 15 పేజీలతో ప్రాథమిక నివేదికను సమర్పించింది. ఫ్లైట్ టేకప్ అయిన కొన్ని సెకన్లలోనే ఫ్యూయల్ స్విచ్‌లు ఆగిపోవడం వల్లే ప్రమాదం జరిగి ఉంటుందని ప్రాథమికంగా నిర్ధరణకు వచ్చింది. ప్రమాదానికి ముందు ఫ్యూయల్ పరిమితిలోనే ఉందని ఏఏఐబీ పేర్కొంది. విమానయాన మార్గంలో పక్షికి సంబంధించి ఎలాంటి కదలికలు నమోదు…