Air India Plane Crash : అహ్మదాబాద్ విమాన ప్రమాదం.. ప్రాథమిక నివేదికలో కీలక విషయాలు!
- ఎయిర్ ఇండియా విమాన ప్రమాద ఘటనపై ప్రాథమిక నివేదిక
- 5 పేజీలతో ప్రాథమిక నివేదికను సమర్పించిన ఏఏఐబీ
- ఫ్లైట్లో ఎటువంటి ప్రమాదకరమైన వస్తువులు లేవు
- విమానంలోని కీలక భాగాలను క్వారంటైన్ చేశాం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Air India Plane Crash Preliminary Report Reveals: అహ్మదాబాద్ ఎయిర్ ఇండియా విమాన ప్రమాద ఘటనపై ప్రాథమిక నివేదిక వెల్లడైంది. ఎయిర్ క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగెంట్ బ్యూరో 15 పేజీలతో ప్రాథమిక నివేదికను సమర్పించింది. ఫ్లైట్ టేకప్ అయిన కొన్ని సెకన్లలోనే ఫ్యూయల్ స్విచ్‌లు ఆగిపోవడం వల్లే ప్రమాదం జరిగి ఉంటుందని ప్రాథమికంగా నిర్ధరణకు వచ్చింది. ప్రమాదానికి ముందు ఫ్యూయల్ పరిమితిలోనే ఉందని ఏఏఐబీ పేర్కొంది. విమానయాన మార్గంలో పక్షికి సంబంధించి ఎలాంటి కదలికలు నమోదు కాలేదని స్పష్టం చేసింది. విమానంలో ఎటువంటి ప్రమాదకరమైన వస్తువులు లేవని, కుట్రం కోణం ఉందని చెప్పడానికి ఎలాంటి ఆధారాలు లేవని ఏఏఐబీ వెల్లడించింది.
జూన్ 12న ఎయిర్ ఇండియా విమాన ప్రమాదంకు గురైంది. ప్రమాదంలో 241 మంది ప్యాసింజర్లు మృతి చెందారు. ఫ్లైట్ టేకప్ అయిన కొన్ని సెకన్లలోనే ఫ్యూయల్ స్విచ్‌లు ఆగిపోయాయని ఏఏఐబీ తన నివేదికలో తెలిపింది. రెండు ఇంజన్ల బటన్స్ రన్ టూ కట్ ఆఫ్‌కు మారాయని, దాంతో ప్లైట్ రెండు ఇంజన్లు ఆగిపోయాయని స్పష్టం చేసింది. విమానం కూలడానికి ముందు పైలట్ల సంభాషణ వివాదాస్పదంగా మారింది. స్విచ్ ఆఫ్ ఎందుకు చేసావు అని మరో పైలెట్‌ను ప్రశ్నించగా.. తాను స్విచ్ ఆఫ్ చేయలేదని సమాధానం ఇచ్చాడు. ఆ తర్వాత పైలెట్స్ మేడే కాల్ ఇచ్చారు. కాక్ పిట్‌లో పైలెట్ల చివరి సంభాషణ రికార్డ్ అయింది.
Also Read
- Shai Hope: ఇంతకంటే ఏం చేయాలి..? చాలా బాధగా ఉంది: వెస్టిండీస్ కెప్టెన్
- Ind Vs WI: భారీ లక్ష్య ఛేదనలో చరిత్ర సృష్టించిన గిల్ సేన.. విండీస్‌పై టీమిండియా ఘన విజయం.. సిరీస్ కైవసం..
- Shubhman Gill: డబుల్ ధమాకా.. వన్డే కెరీర్లో రెండో డబుల్ సెంచరీ బాదిన శుభ్‌మన్ గిల్..
- Range Rover Sport Electric: రేంజ్ రోవర్ స్పోర్ట్ ఎలక్ట్రిక్ బుకింగ్స్ ఓపెన్.. ఒక్క ఛార్జ్‌తో 609 కి.మీ..
ప్రమాదానికి ముందు ఫ్యూయల్ పరిమితిలోనే ఉందని ఏఏఐబీ పేర్కొంది. ‘రెండు ఇంజన్ల ఇంధన స్విచ్ ‘కటాఫ్’ నుంచి మళ్లీ ‘రన్’కు మారింది. ఫ్లైట్లో ఎటువంటి ప్రమాదకరమైన వస్తువులు లేవు. అహ్మదాబాద్ ఎయిర్‌పోర్ట్ ప్రహరీ దాటక ముందే విమానం ఆగిపోయింది. విమాన ప్రమాదంపై దర్యాప్తు కొనసాగుతోంది. విమానంలోని కీలక భాగాలను క్వారంటైన్ చేశాం’ అని ఏఏఐబీ తెలిపింది.
తాజావార్తలు
-
Shai Hope: ఇంతకంటే ఏం చేయాలి..? చాలా బాధగా ఉంది: వెస్టిండీస్ కెప్టెన్
-
Ind Vs WI: భారీ లక్ష్య ఛేదనలో చరిత్ర సృష్టించిన గిల్ సేన.. విండీస్‌పై టీమిండియా ఘన విజయం.. సిరీస్ కైవసం..
-
Shubhman Gill: డబుల్ ధమాకా.. వన్డే కెరీర్లో రెండో డబుల్ సెంచరీ బాదిన శుభ్‌మన్ గిల్..
-
Range Rover Sport Electric: రేంజ్ రోవర్ స్పోర్ట్ ఎలక్ట్రిక్ బుకింగ్స్ ఓపెన్.. ఒక్క ఛార్జ్‌తో 609 కి.మీ..
-
Team India Record: టీమిండియా రికార్డుల మోత.. 20 ఏళ్ల రికార్డు చెల్లాచెదురు..
ట్రెండింగ్
-
John Campbell Record: భారత్‌పై శివాలెత్తిన జాన్ క్యాంప్‌బెల్.. మొదటి బ్యాటర్‌గా అరుదైన రికార్డు!
-
రూ.1,100కే కొత్త ఫీచర్ ఫోన్.. 1,000mAh బ్యాటరీ, USB-C ఛార్జింగ్ తో HMD 106 Pure లాంచ్.!
-
Diwali Crackers: దీపావళి టపాసులపై సుప్రీం కీలక వ్యాఖ్యలు.. నిర్దిష్ట సమయంపై నిర్ణయం.!
-
Japanese Cleaning Tips: ఇల్లు ఎప్పుడూ నీట్‌గా ఉండాలంటే.. జపాన్ వాళ్ల ఈ 6 అలవాట్లు ఫాలో అవ్వండి..!
-
Gold Medal For India: పతకాల జోరు.. కాంపౌండ్ మిక్స్డ్ టీమ్‌లో చరిత్ర.. ఆసియా గేమ్స్‌లో భారత్‌కు మరో స్వర్ణం..!