Maharashtra Elections: మహారాష్ట్ర రాజకీయాల్లో ఈసారి ఓ కొత్త గాలి వీసింది. ఇప్పటివరకు పెద్దగా లెక్కచేయని ఒక పార్టీ, ఇప్పుడు నగరాల్లో గట్టిగా తన ఉనికిని చాటింది. హైదరాబాద్ కేంద్రంగా పనిచేసే ఏఐఎంఐఎం పార్టీ, గాలిపటం గుర్తుతో పోటీ చేసి 2026 మున్సిపల్ ఎన్నికల్లో అత్యుత్తమ ఫలితాలు సాధించింది. బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపు తర్వాత.. మహారాష్ట్రలోనూ తమది చిన్న పార్టీ కాదని నిరూపించుకుంది. అసదుద్దీన్ ఒవైసీ నాయకత్వంలో ఈ పార్టీ మొత్తం 125 సీట్లు గెలుచుకుంది.…