ఢిల్లీలోని ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ సర్వర్లపై సైబర్ దాడికి పాల్పడింది చైనా హ్యాకర్లేనని ప్రభుత్వ వర్గాలు ఈ రోజు తెలిపాయి. ప్రస్తుతం అందులోని డేటాను రిట్రీవ్ చేసినట్లు తెలిపాయి. ఈ సైబర్ దాడి చైనా హ్యాకర్ల పనే అని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖకు చెందిన ఓ సీనియర్ అధికారులు చెప్పినట్లు తెలుస్తోంది.
మనిషి పుట్టుక నుంచి చావు దాకా ప్రతీ విషయంలోనూ ఏదో ఒక పరమార్థం దాగే ఉంటుంది అంటారు పెద్దలు. కొంతమంది సమాజం కోసం తమ జీవితాన్ని త్యాగం చేస్తే.. మరికొంత మంది తాము చనిపోయినా అవయవదానంతో నలుగురికి పునర్జన్మ కలిగించే గొప్ప భాగ్యం పొందుతారు.
ఢిల్లీలోని ప్రతిష్టాత్మక ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్)కి కొత్త డైరెక్టర్‌గా డాక్టర్ ఎం శ్రీనివాస్‌ను ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేబినెట్ నియామక కమిటీ శుక్రవారం నియమించింది.
కరోనా సెకండ్ వేవ్ తగ్గుముఖం పడుతుండటంతో సాధారణ జనజీవనం కనిపిస్తోంది. ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు కూడా లాక్ డౌన్ ను పూర్తిస్థాయిలో ఎత్తివేయడానికి సన్నద్ధం అవుతున్నాయి. అయితే కరోనా థర్డ్ వేవ్ ముప్పు పొంచివుందని కొన్ని నెలలుగా వార్తలు వినిపిస్తూనే వున్నాయి. మరి ముఖ్యంగా థర్డ్ వేవ్ పిల్లలపై ఎక్కువగా ఉంటుందనే ప్రచారం కూడా జరుగుతోంది. అయితే తాజాగా ప్రపంచ ఆరోగ్య సంస్థ-ఎయిమ్స్(ఢిల్లీ) కలిసి చేసిన ఓ అధ్యయనం ఊరటనిచ్చే అంశాన్ని వెల్లడించింది. భవిష్యత్తులో థర్డ్ వేవ్…