ఇవాళ ఇండియా కూటమి నేతల వర్చువల్ సమావేశంలో పాల్గొనింది. ఈ మీటింగ్ లో కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గేను కూటమి అధ్యక్షుడిగా నియమించింది. అదే సమయంలో బీహార్ ముఖ్యమంత్రి, జేడీయూ జాతీయ అధ్యక్షుడు నితీష్ కుమార్‌ను కూటమికి సమన్వయకర్తగా ఎన్నిక అయ్యారు.
కుత్బుల్లాపూర్ నియోజక వర్గంలో జరుగుతున్న ఎన్నికల ప్రచారంలో భాగంగా కుత్బుల్లాపూర్ మున్సిపల్ గ్రౌండ్‌లో కాంగ్రెస్ బహిరంగసభ జరిగింది. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కొలన్ హనుమంత్ రెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కాంగ్రెస్ జయ భేరి సభకు అఖిలభారత కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో పాటు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, తెలంగాణా వ్యవహారాల ఇంఛార్జి మాణిక్యం ఠాక్రే హాజరయ్యారు.
మెదక్ ఆర్డినెన్స్ ఫ్యాక్టరీని బీజేపీ ప్రైవేట్ పరం చేయాలని చూస్తోందని కాంగ్రెస్ జాతీయాధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే ఆరోపించారు. అందుకు బీఆర్‌ఎస్ సహకరిస్తుందన్న ఆయన.. బీజేపీ, బీఆర్‌ఎస్‌లు ఒక్కటేనన్నారు. బీజేపీకి బీఆర్‌ఎస్ ఏ టీం, బీఆర్‌ఎస్‌కు బీజేపీ బీ టీం అంటూ ఆయన విమర్శించారు. కాంగ్రెస్ విజయభేరి యాత్రలో భాగంగా మెదక్‌లో నిర్వహించిన జనసభలో ఆయన ప్రసంగించారు.
కాంగ్రెస్ కొత్త సారథిగా మల్లికార్జున ఖర్గే ప్రమాణ స్వీకారం చేశారు. ప్రస్తుతం తాత్కాలిక అధ్యక్షురాలిగా కొనసాగుతున్న స సోనియా గాంధీ నుంచి ఖర్గే బాధ్యతలు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో రాహుల్ గాంధీతో పాటు పలువురు కాంగ్రెస్ సీనియర్ నేతలు పాల్గొన్నారు.
ఏఐసీసీ అధ్యక్ష పదవి ఎన్నికల్లో అఖండ విజయం సాధించిన మల్లికార్జున్ ఖర్గే.. నేడు ఆ బాధ్యతలు చేపట్టనున్నారు. ఢిల్లీలోని ఏఐసీసీ కార్యాలయం ఉదయం 10.30 గంటలకు సమావేశం ప్రారంభం కానుంది.