టాలెంటును వెలికితీసేందుకు సరైన వేదికలు అందించడంలో ఎప్పుడూ ముందుండే ఆహా, మరో సారి యువ గాయకుల ప్రతిభను వెలికి తీసింది. తాజాగా ఆహా తెలుగు ఇండియన్ ఐడల్ సీజన్ 3లో పాల్గొన్న నజీర్, భరత్ రాజ్, పవన్ కళ్యాణ్ నటిస్తున్న భారీ చిత్రం ‘ఓజీ’లో పాటకు పాడే చేసే అవకాశం పొందారు. ఈ చిత్రానికి ప్రముఖ సంగీత దర్శకుడు తమన్ సంగీత దర్శకత్వం వహిస్తున్న సంగతి తెలిసిందే. ఆయనే ఇండియన్ ఐడల్ సీజన్ 3లో జడ్జిగా వ్యవహరించారు.…