ధాన్యం కొనుగోళ్లలో మిల్లర్లు, మధ్యవర్తుల ప్రమేయం లేకుండా మిగిలిన సేకరణ కూడా జరగాలని సీఎం జగన్ వ్యవసాయ శాఖ అధికారులను ఆదేశించారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో వ్యవసాయశాఖపై సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు. రైతులకు ఎక్కడా నష్టంలేకుండా చూడాలని సూచించారు. ఇప్పుడున్న ప్రక్రియను మరింత బలోపేతం చేయాలన్నారు. రైతులకు మిల్లర్లతో పని ఉండకూడదు, ధాన్యం కొనుగోలు కేంద్రాలవద్ద విక్రయంతోనే రైతుల పని ముగుస్తుంది, ఆతర్వాత అంతా ప్రభుత్వానిదే బాధ్యత అని గుర్తు చేశారు. రైతులకు ఇబ్బంది…
CM Jagan: అమరావతిలోని తాడేపల్లి క్యాంప్ కార్యాలయంలో సోమవారం నాడు వ్యవసాయ శాఖపై అధికారులతో సీఎం జగన్ సమీక్షించారు. ఈ సమావేశానికి మంత్రులు కాకాణి గోవర్ధన్‌రెడ్డి, కారుమూరి నాగేశ్వరరావు, పలువురు ఉన్నతాధికారులు హాజరయ్యారు. ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ.. ధాన్యం కొనుగోలులో మిల్లర్ల పాత్ర తీసివేస్తున్నామని.. రైతులకు గరిష్ట ప్రయోజనాలు అందించేలా అధికారులు ధాన్యం సేకరణ కొనసాగించాలని సీఎం జగన్ సూచించారు. అటు ఎంఎస్‌పీ కన్నా తక్కువ ధరకు రైతులు అమ్ముకోవాల్సి వచ్చిందనే మాట ఎక్కడా…
తెలంగాణలో ఎరువుల దుకాణాలపై దాడులు నిర్వహిస్తున్నారు వ్యవసాయ శాఖ అధికారులు. అక్రమాలకు పాల్పడుతున్నట్లుగా ఫిర్యాదులు రావడంతో అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టారు. ఈ మేరకు తెలంగాణలోని ఎరువుల దుకాణాలపై వ్యవసాయ శాఖ అధికారుల ఆధ్వర్యంలో ఏకకాలంలో దాడులు కొనసాగుతున్నాయి. తాజాగా మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల పట్టణంలో సీడ్ & ఫెర్టిలైజర్ దుకాణాలపై జిల్లా ఎన్ఫోర్స్మెంట్ అధికారులు దాడులు నిర్వహించారు. ఆరు దుకాణాలలో తనిఖీలు చేపట్టగా.. సుమారు 8 లక్షల విలువైన అనుమతుల్లేని పత్తి విత్తనాలను పట్టుకున్నారు.…