ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం లో మూడవ సంవత్సరం బీఎస్సీ(అగ్రికల్చర్) కోర్సు చదువుతున్న సుమారు 35 మంది ఇన్ సర్వీస్ అభ్యర్థుల ప్రవేశాలను రద్దు చేసి, వారిని తిరిగి వ్యవసాయ శాఖ కి పంపిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఇటీవల ఉప కులపతి ప్రొఫెసర్ అల్డాస్ జానయ్య, ఇతర అధికారుల తో కలసి జగిత్యాల వ్యవసాయ కళాశాల ని సందర్శించారు. వివిధ రకాల రికార్డుల పరిశీలన, సీసీ ఫుటేజ్ ల ఆధారంగా సెమిస్టర్ ఫైనల్ పరీక్షల…