దేశవ్యాప్తంగా జరుగుతున్న అగ్నిపథ్ నిరసనల నేపథ్యంలో జాతీయ భద్రతా సలహాదారు అజిత్ ధోవల్ స్పందించారు. అగ్నివీరుల భవిష్యత్‌పై ఎలాంటి ఆందోళనలు అవసరం లేదన్నారు. భవిష్యత్‌లో మనం కనిపించని శత్రువులపై యుద్ధాలు చేయాల్సిన అవసరం వస్తుందని.. ఈ నేపథ్యంలో దేశానికి యువత సేవలు అందించాల్సిన అవసరం ఉందన్నారు. అగ్నిపథ్‌ను సమర్థించిన అజిత్ ధోవల్.. యువ, సుశిక్షిత సేనలు దేశానికి అవసరమన్నారు. అగ్నిపథ్‌ను పథకాన్ని మరో కోణంలో చూడాలన్నారు. అగ్నిపథ్ అనేది 2014లో ప్రధాని నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చినప్పుడు,…